అనకాపల్లి: మహా శివరాత్రి సందర్భంగా బుధవారం గొలుగొండ మండలం ధారమఠం శివాలయం భక్తులతో పోటెత్తింది. ముందుగా ఇక్కడ జలపాతాల వద్ద భక్తులు స్నానాలచరించి మహాశివుడిని దర్శించుకున్నారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఆలయ కమిటీ అన్ని ఏర్పాట్లు చేసింది. పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.