W.G: సీపీఐ శత వార్షికోత్సవాలను పార్టీ శ్రేణులు వాడవాడలా ఘనంగా నిర్వహించి వందేళ్ల ఉద్యమ పోరాట చరిత్ర వివరించాలని సీపీఐ పశ్చిమగోదావరి జిల్లా కార్యదర్శి కోనాల భీమారావు పిలుపునిచ్చారు. బుధవారం భీమవరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో సీపీఐ శత వార్షికోత్సవాల వాల్ పోస్టర్ ను పార్టీ నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు పాల్గొన్నారు.