కృష్ణా: గుడివాడ మండలం రామన్నపూడి క్రాస్ రోడ్స్ వద్ద రహదారి ప్రమాదాలను నివారించడానికి ప్రత్యేక చర్యగా రేడియం స్టిక్కరింగ్ డ్రమ్స్‌ను సోమవారం ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వాహనదారులకు స్పష్టమైన దృశ్యమానత లభించేందుకు, ప్రమాదాలు తగ్గించేందుకు ఈ ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఐ చంటిబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.