ATP: ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డిపై తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ధర్మవరంలో కేతిరెడ్డి ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని ప్రశ్నించారు. CM చంద్రబాబును విమర్శించే స్థాయి కేతిరెడ్డికి లేదని మండిపడ్డారు. నోటికి వచ్చినట్లు తప్పుడు మాటలు మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.