KRNL: జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గుడిసె క్రిష్ణమ్మ సోమవారం అమరావతిలో CM చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై సీఎంతో చర్చించారు. కార్యకర్తలతో సమన్వయంగా ఉంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లాలని ఈ సందర్భంగా చంద్రబాబు ఆమెకు సూచించారు. పార్టీ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని క్రిష్ణమ్మ తెలిపారు.