SKLM: టెక్కలి మండలం నౌపడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం విద్యార్థులు సూర్య నమస్కారాలు చేశారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాల మేరకు కళాశాల ఆవరణలో యోగా, సూర్యనమస్కారాలు నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ ఎస్. భీమేశ్వరరావు పర్యవేక్షణలో యోగా శిక్షకురాలు సత్తారు ఉషారాణి విద్యార్థులచే యోగాసనాలు వేయించారు. NSS పీఓ టీ. తిరుమలరావు, తదితరులున్నారు.