విజయనగరం: బుడా ఛైర్మన్, మాజీ ఎమ్మెల్యే తెంటు లక్ష్మునాయుడు మాతృమూర్తి తెంటు జయప్రకాష్ సతీమణి పెద్దకర్మ కార్యక్రమానికి ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి హాజరయ్యారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలువేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆనంతరం ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి పరామర్శించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి పాల్గొన్నారు.