ప్రకాశం: త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురంతాకేశ్వరస్వామి వారిని బుధవారం తెల్లవారుజామున గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో అన్నా రాంబాబు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ ధర్మకర్తలు స్వామివారి తీర్థ ప్రసాదాలను అన్నా రాంబాబుకు అందజేశారు.