GNTR: తాడికొండకి చెందిన ఓ మైనర్ బాలికను లైంగిక వేధింపులకు గురిచేస్తున్న అదే గ్రామానికి చెందిన అస్లాం అనే వ్యక్తిపై శనివారం తాడికొండ పోలీసులు కేసు నమోదు చేశారు. CI వాసు కథనం మేరకు.. కాలేజీకి వెళ్లే సమయంలో బాలికను ప్రేమను అంగీకరించమని లేదంటే చంపుతానని వెంబడిస్తూ లైంగికంగా వేధిస్తున్నాడు. విషయం తెలిసిన బాలిక తాత నిందితుడిని హెచ్చరించాడు.