PLD: మాచవరం మండలం, మొర్జంపాడు గ్రామానికి చెందిన రైతు పోతిరెడ్డి శ్రీనివాసరెడ్డి, తన మిర్చి పంటపై కావాలనే గడ్డి మందు కొట్టారని సోమవారం మాచవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన పేరం నరసింహారెడ్డి ఈ పని చేశారని శ్రీనివాసరెడ్డి ఆరోపిస్తున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా పొలం వివాదం నడుస్తున్నట్లు తెలుస్తోంది.