KKD: శంఖవరం మండలం అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలోని మండపం జాతీయ రహదారి కూడలిలో ఆటోలో తరలిస్తున్న 72 లీటర్ల సారా పొట్లాలను, నాలుగు బెల్లం బస్తాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శంఖవరం మండలం గౌరవంపేటకు చెందిన నాగబాబు, పోలవరంనకు చెందిన సత్తిబాబు, రౌతులపూడి మండలం మెరక చామవరంనకు చెందిన ధర్మరాజు అనే ముగ్గుర్ని అరెస్ట్ చేసి వారిపై కేసును నమూదు చేశారు.