కృష్ణా: ఉచితంగా విద్య, వైద్యం అందుబాటులోకి తీసుకురావాలన్న ఉద్దేశంతో జగన్ 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చేస్తే ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు. గుడివాడలోని వైసీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా కోటి సంతకాల సేకరణ పోస్టర్ను వైసీపీ నేతలు ఆవిష్కరించారు.