సత్యసాయి: తలుపుల మండలంలోని పెద్దన్నవారిపల్లిలో శనివారం సీఎం చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా శనివారం సాయంత్రం సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి సవిత, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్, జిల్లా కలెక్టర్ శ్యాం ప్రసాద్ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ శనివారం సాయంత్రం పరిశీలించారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు సిద్ధమయ్యాయని కలెక్టర్ వివరించారు.