NLR: శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మనుబోలు కేఆర్.పురం శ్రీ సీతారామాంజనేయ స్వామి ఆలయంలో శనివారం రాత్రి సీతారాముల ఏకాంత సేవను కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అర్చకులు సాయికుమార్ శర్మ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాములను పట్టు వస్త్రాలు, పూలతో అలంకరించారు. తొమ్మిది రకాల మిఠాయిలను, పండ్లను స్వామివారికి సమర్పించారు.