VZM: సచివాలయ సిబ్బంది సకాలంలో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఎస్ రాంసుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం గరివిడి మండలం కొండపాలెం సచివాలయాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. హాజరు పట్టికను, సిబ్బంది సమయానికి వస్తుంది, లేనిది దానిపై ఆరా తీశారు. ప్రజలతో ముఖాముఖి మాట్లాడి, అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్డీవో పాల్గొన్నారు.