W.G: తణుకు పట్టణానికి గురువారం సినీనటి నిధి అగర్వాల్ వచ్చారు. తణుకులోని పార్వతి సమేత కపర్దేశ్వర స్వామి వారి ఆలయాన్ని ఆమె సందర్శించుకున్నారు. కార్తీక మాసం పురస్కరించుకుని ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులను పొందారు. ఇటీవల ఆలయాన్ని పునర్నిర్మించడంతో తణుకు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు.