VSP: యువతిని ప్రేమ పేరుతో మోసం చేశాడంటూ ఓ యువకుడిపై మల్కాపురం పోలీస్ స్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. CI విద్యాసాగర్ తెలిపిన వివరాల ప్రకారం 40వ వార్డు AKC కాలనీకి చెందిన ప్రవీణ్ అదే కాలనీలో ఉంటున్న యువతిని ప్రేమించాడు. కాగా యువతి గర్భం దాల్చగా పెళ్లికి నిరాకరించాడు. దీంతో యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా అతనికి కౌన్సెలింగ్ ఇచ్చారు.