విశాఖ మధురవాడ 7వ వార్డు సుద్దగెడ్డ సమీపంలో టిడ్కో గృహాల వద్ద రహదారి విస్తరణలో బయటపడ్డ శ్రీరాముడి విగ్రహాన్ని పురావస్తు శాఖ పరిశీలించింది. ఇది పురాతన రాతితో తయారై, శైలి ఆధారంగా 16వ శతాబ్దానికి చెందినదిగా అధికారులు నిర్ధారించారు. మిగతా రాముని విగ్రహ భాగాలు కూడా అక్కడే ఉండే అవకాశం ఉందని తెలిపారు.