ADB: ఈనెల 25, 27, 28వ తేదీల్లో పత్తి కొనుగోళ్లు నిలిపివేసినట్లు ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ అధికారి గజానంద్ బుధవారం తెలియజేశారు. 25న క్రిస్మస్ పండుగ, 27, 28 సెలవు రోజు కావటంతో కొనుగోలు నిలిపి వేస్తున్నట్లు వెల్లడించారు. ఈనెల 26న కొనుగోలు యథా విధిగా కొనసాగుతాయని తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి, సహకరించాలని అధికారులు కోరారు.