KKD: ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని ఈ నెల 3న కాకినాడ కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారం నిమిత్తం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా స్థాయి పీజీఆర్ఎస్కు అర్జీదారులు హాజరై తమ సమస్యలను వినియోగించుకోవాలన్నారు.