W.G: మొగల్తూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తూర్పుతాళ్ల సెంటర్లో 2024 సెప్టెంబర్లో జరిగిన జ్యువెలరీ షాపు దొంగతనం కేసును ఛేదించిన కానిస్టేబుల్ నాగేంద్రబాబుకు అభినందనలు వెల్లువెత్తాయి. కేసును సమర్ధవంతంగా పరిష్కరించినందుకు ఎస్పీ అద్నాన్ చేతుల మీదుగా ఆయన ప్రశంసాపత్రాన్ని అందుకున్నారు. సోమవారం రాత్రి మొగల్తూరు స్టేషన్ ఎస్సైలు జి. వాసు, నాగలక్ష్మి అభినందించారు.