HNK: రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు ఈ నెల 15న ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్పర్సన్ వి.బి. నిర్మలా గీతాంబ తెలిపారు. ఇన్సూరెన్స్, బ్యాంకు, చిట్ఫాండ్, క్రిమినల్, సివిల్, కుటుంబ కేసులు పరిష్కారానికి అవకాశం కల్పిస్తామని ఆమె పేర్కొన్నారు. కక్షిదారులు, అధికారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.