W.G: ఉపాధ్యాయులపై ప్రభుత్వం అదనపు పని భారం వేయడం సరికాదని గురువారం ఫ్యాప్టో సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు నరసాపురంలో ఆందోళన చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్నం భోజనం వివరాలు మాత్రమే ఆన్లైన్ చేస్తామన్నారు. ఇతర పనుల నుంచి ఉపాధ్యాయులకు విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఎంఈవో-2 జాన్ ప్రభాకర్‌కు వినతిపత్రం అందించారు.