సత్యసాయి: ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో పోలీస్ అధికారులు బుధవారం రాత్రి గ్రామాలను సందర్శించి ప్రజలకు సైబర్ నేరాలు, చీటింగ్, సోషల్ మీడియా మోసాలు, బాల్యవివాహాలు, పోక్సో చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామసభలు నిర్వహించి పేకాట, గంజాయి, అక్రమ మద్యం వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామాల్లో ప్రశాంత జీవనం సాగించాలని సూచించారు.