CTR: వినాయక స్వామివారి దేవస్థానం గోశాలలో ఈవో పెంచల కిషోర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. వేసవిలో గోవులకు సమయానికి దాణా, పచ్చగడ్డి, తాగునీరు అందించాలని సిబ్బందికి సూచించారు. ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని, గోశాలలను పరిశుభ్రంగా ఉంచాలని, పశువైద్యుడి పర్యవేక్షణ తప్పనిసరి చేయాలని ఆదేశించారు.