VSP: సీఐటీయూ ఆంధ్ర రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు కామ్రేడ్ పర్సా సత్యనారాయణ 11వ వర్ధంతి సభ శనివారం మద్దిలపాలెంలోని సీతారాం ఏచూరి భవన్లో నిర్వహించారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కుమార్ మాట్లాడుతూ.. పర్సా సత్యనారాయణ కార్మిక ఉద్యమానికి విశేష సేవలు అందించారని తెలిపారు. కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడారని పేర్కొన్నారు.