ATP: పామిడి పట్టణంలోని సత్యసాయి తాగునీటి శుద్ధి కేంద్రాన్ని శుక్రవారం మున్సిపల్ కమిషనర్ జబ్బర్ మియా, మున్సిపల్ డీఈతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాబోయే వేసవికాలంలో గుత్తి మున్సిపాలిటీలో తాగునీటి సమస్య నివారణ కొరకు ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు వారు తెలిపారు. చెడిపోయిన తాగునీటి బోర్లకు మరమ్మతు పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.