అన్నమయ్య: మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అడ్డగోలు ఒప్పందాలతోనే నేడు ప్రజలపై విద్యుత్ భారం పడుతోందని టీడీపీ రాజంపేట పార్లమెంట్ అధికార ప్రతినిధి ఆర్.జే.వెంకటేష్ ఆరోపించారు. సోమవారం మదనపల్లె పట్టణంలో ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి 2.49 పైసలతో 25 సంవత్సరాలకు ఒప్పందం కుదుర్చుకోవడం జరిగిందన్నారు. అలాగే 9 సార్లు ఆయన కరెంటు చార్జీలు పెంచడం జరిగిందన్నారు.