KDP: ప్రొద్దుటూరుకు చెందిన సింహా సేన్ రెడ్డి కుమార్తె దియా సింహ రాష్ట్రస్థాయి స్కేటింగ్ పోటీలకు ఎంపికైంది. కడపలో శనివారం జరిగిన జిల్లా స్థాయి స్కేటింగ్ పోటీలలో విద్యార్థిని దియా సింహ బ్రాంజ్ మెడల్ సాధించి ఉత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైంది. విశాఖపట్నంలో జరగనున్న రాష్ట్రస్థాయి పోటీలలో దియాసింహ పాల్గొననున్నట్లు కోచ్ నాగేశ్వరరావు తెలిపారు.