శ్రీకాకుళం పీఎన్ కాలనీకి ఆనుకుని ఉన్న నీలంచెరువు ఆక్రమణలు తొలగించాలని నారాయణపురం ప్రాజెక్ట్ కమిటీ ఉపాధ్యక్షుడు పంచిరెడ్డి కృష్ణారావు శుక్రవారం డిమాండ్ చేశారు. చౌదరి సత్యన్నారాయ కాలనీ సచివాలయం పరిధిలోని నీలంచెరువు ఆక్రమణకు గురి అవుతోంది. ఈ విషయంపై కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి చూస్తామన్నారు. ఆయనతోపాటు నీటి సంఘం అధ్యక్షులు రామారావు ఉన్నారు.