సత్యసాయి: సచివాలయంలో వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సత్య కుమార్ యాదవ్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న కీలక ఆరోగ్య కార్యక్రమాల పురోగతిని ఆయన తెలుసుకున్నారు. డిజిటల్ హెల్త్ వ్యవస్థలు, ముఖ్య ప్రాజెక్టుల అమలు, భవిష్యత్ సంస్కరణలపై అధికారులతో చర్చించారు.