కృష్ణా: రైతులకు ప్రభుత్వం సత్వర సహాయం అందిస్తుందని ఏఎంసీ ఛైర్మన్ తోట కనకదుర్గ అన్నారు. శుక్రవారం సాయంత్రం చల్లపల్లి మండలం పాత మాజేరులో వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పంటలు పరిశీలించారు. తుఫాన్ ప్రభావిత రైతులకు కలిగిన నష్టం త్వరితగతిన అంచనా వేయించి ప్రభుత్వం ఆదుకుంటుందని తెలిపారు. పెట్టుబడి సహాయం కూడా అతి త్వరలో రైతుల ఖాతాలకు నేరుగా జమ అవుతుందని తెలిపారు.