PPM: పాచిపెంట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ సీ. యశ్వంత్ కుమార్ రెడ్ది గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ అందుతున్న వైద్య సేవలను సమీక్షించి, ఆసుపత్రిలోని వివిధ విభాగాలను స్వయంగా ఆయన పరిశీలించారు. ఆనంతరం రోగులకు అందుతున్న సౌకర్యాలపై వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రికి వచ్చే రోగుల వివరాలపై ఆరా తీశారు.