AKP: సంపద కేంద్రాల ద్వారా సేంద్రియ ఎరువుల తయారీపై పంచాయతీ కార్యదర్శులు దృష్టి పెట్టాలని గ్రామీణ మంచినీటి విభాగం జిల్లా కన్సల్టెంట్ లోవరాజు సూచించారు. శుక్రవారం నాతవరం మండలం శృంగవరంలో సంపద కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా తయారవుతున్న సేంద్రియ ఎరువును పరిశీలించారు. మార్కెట్లో సేంద్రియ ఎరువుకు మంచి డిమాండ్ ఉందన్నారు.