AKP: మునగపాక మండలం వాడ్రాపల్లిలో వినాయకుడి గుడిపై దేవతామూర్తుల విగ్రహాలను బుధవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విష్వక్సేన పూజ పుణ్యాహవాచనం, అభిషేకాలు, అర్చనలు తదితర కార్యక్రమాలను జరిపించారు. స్థానిక ఎల్లారమ్మ సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలుగు రైతు జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లవరహా నరసింహమూర్తి తెలిపారు.