ప్రకాశం: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో శనివారం కనిగిరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి రవితేజ తెలిపారు. మేళా కార్యక్రమంలో డైకాన్, పీస్కార్ట్ కంపెనీలు పాల్గొంటాయన్నారు. జిల్లాలోని 19 నుంచి 27 సంవత్సరల మధ్యగల ఇంటర్మీడియట్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.