ASR: కొయ్యూరు మండలం వైఎన్ పాకలు గ్రామానికి చెందిన సెగ్గే తేజస్ రామాంజనేయ స్వరూప్ ఎన్ఐటీలో సీటు సాధించాడు. ఇటీవల వెలువడిన జేఈఈ మెయిన్స్‌లో ఉత్తమ ప్రతిభ కనపరచిన స్వరూప్‌కు మిజోరం ఎన్ఐటీలో మెకానికల్‌లో సీటు లభించిందని స్వరూప్ తండ్రి సతీష్ ఆదివారం తెలిపారు. మారుమూల గ్రామానికి చెందిన గిరిజన యువకుడు ఎన్ఐటీలో సీటు సంపాదించడం పట్ల పలువురు అభినందించారు.