విశాఖ బీచ్ రోడ్డులోని ‘విక్టరీ ఎట్ సీ’ వద్ద నేవీ డే సందర్భంగా తూర్పు నౌకాదళ అధికారులు, కలెక్టర్ హరేందిర ప్రసాద్ అమర నావిక దళ వీరులకు నివాళులర్పించారు. రక్షణ వ్యవస్థలో తూర్పు నౌకాదళం పాత్ర అపారమని వారు అన్నారు. ఈసారి విశాఖలో నేవీ డే విన్యాసాలు లేకపోవడంతో నగరవాసులు అసంతృప్తి వ్యక్తం చేశారు.