W.G: జిల్లాలో నేటి నుంచి 3వ దశ రీ-సర్వే జిల్లాలో మొదలవుతుందని కలెక్టర్ నాగరాణి ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 221 గ్రామాలలో రీ-సర్వే పూర్తి చేశామని, మరో 22 గ్రామాలలో జరుగుతోందని అన్నారు. రైతులందరూ రీ-సర్వేకు సహకరించాలని కోరారు. రెవెన్యూ సిబ్బంది మీ భూమి సర్వే ఎప్పుడు చేస్తారో ముందుగా నోటీస్ ద్వారా తెలియజేస్తారని, రైతులు హాజరు కావాలన్నారు.