కాకినాడ నుంచి విశాఖపట్నంకు సముద్ర మార్గంలో ప్రయాణించేలా టూరిజం శాఖ సరికొత్త ప్రతిపాదనలు సిద్ధం చేసింది. రూరల్ బీచ్ నుంచి ‘సీ గైడర్స్’ వాహనాలను ప్రవేశపెట్టే దిశగా ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే కేవలం గంటలోపే విశాఖకు చేరుకోవచ్చని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న రైలు, బస్సు సర్వీసులకు ఇది ఉత్తమ ప్రత్యామ్నాయంగా మారుతుంది.