VSP: జిల్లాలో 22ఏళ్ల యువకుడు చనిపోయాడు. మల్కాపురానికి చెందిన సిద్ధు శ్రీహరిపురం వద్ద సోమవారం రాత్రి పార్కింగ్ చేసిన బైక్ తీస్తుండగా కిందపడి గాయపడ్డాడు. ప్రాథమిక చికిత్స తర్వాత ఇంటికి వెళ్లాడు. మంగళవారం ఉదయం అస్వస్థతకు గురికావడంతో KGHకు తరలించారు. అక్కడ అతను చనిపోయినట్లు మల్కాపురం సీఐ విద్యాసాగర్ తెలిపారు. మృతుడి సోదరుడు నవీన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు.