సత్యసాయి: పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సునీల్ వైట్ల అకస్మాత్తుగా మరణించారు. ఆయన మృతి పట్ల బీజేపీ శ్రేణుల్లో విషాదం నెలకొంది. సునీల్ వైట్ల సేవలను పార్టీ నాయకులు, కార్యకర్తలు స్మరించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.