PLD: నేడు ఉదయం కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీలు & దివ్యాంగుల ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక జరుగుతుంది. ఉదయం 10.30 గం.లకు స్థానిక కలెక్టరేట్లో ఎస్సీ, ఎస్టీల కోసం, దివ్యాంగుల కోసం యథాతథంగా ప్రత్యేక ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహించనున్నామని జిల్లా కలెక్టర్ కృతిక శుక్లా వెల్లడించారు. అవసరమైన ప్రజలు వినియోగించుకోవాలని కోరారు.