ఒంగోలు రూట్ సెట్ ఆధ్వర్యంలో ఉమ్మడి ప్రకాశం జిల్లా నిరుద్యోగ మహిళలకు బ్యూటీపార్లర్ కోర్సులో ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లుగా రూడ్ సెట్ సంస్థ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా నవంబర్ 25 నుంచి డిసెంబర్ 29వ తేదీ వరకు ఒంగోలులోని రూడ్ సెట్ శిక్షణ ఇస్తామన్నారు. అయితే 19 ఏళ్ల నుంచి 50 ఏళ్లలోపు మహిళలు అర్హులన్నారు. శిక్షణ కాలంలో ఉచిత భోజనం, వసతి కల్పిస్తున్నట్లు తెలిపారు.