VZM: బొబ్బిలి పట్టణంలోని స్థానిక ప్రభుత్వాసుపత్రిలో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. టీడీపీ దివ్యాంగుల సెల్ కార్యదర్శి చీమల రాంబాబు ఆధ్వర్యంలో రోగులకు పండ్లను పంపిణీ చేశారు. దివ్యాంగులు ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు రాంబార్కి శరత్, తదితరులు పాల్గొన్నారు.