SKLM: మేరా యువభారత్ వాలంటీర్స్ వసంతలక్ష్మి, దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం శాంతినికేతన్ కళాశాలలో ‘సద్భావన దివాస్’ను బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా సెట్ శ్రీ సూపరిండెండెంట్ ఎల్.రేఖ పాల్గొన్నారు. భారతీయులందరిలో ఐక్యత, శాంతి, సానుభూతి, మత సామరస్యాన్ని పెంపొందించడమే ‘సద్భావన దివాస్’ యొక్క ఉద్దేశ్యమని విద్యార్థులకు వివరించారు.