గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తుళ్లూరు పోలీస్ స్టేషన్ను ఇవాళ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లో సిబ్బంది, వాహనాల కొరత ఉందని, అలాగే ఆఫీస్ రూమ్లు ఇరుకుగా ఉన్నాయని తుళ్లూరు డీఎస్పీ మురళీ కృష్ణ ఎస్పీకి వివరించారు. కాగా, ఎస్పీ వకుల్ జిందాల్ స్టేషన్లోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, సిబ్బందికి పలు సూచనలు చేశారు.