NDL: నీటి ప్రవాహాల వద్ద యువత సెల్ఫీలు తీసుకోవడం, షార్ట్ ఫిలింలు తీయడం వంటి సరదాలు వద్దని చాగలమర్రి మండల పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ రాజారెడ్డి తగు హెచ్చరికలు జారీ చేశారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. యువత సరదాలకు వెళ్లి తల్లిదండ్రులకు విషాదం మిగిల్చకూడదని సూచించారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్న సమయంలో నదిలోకి దిగకూడదని తెలిపారు.