ELR: ప్రభుత్వ తప్పుడు నిర్ణయాల వల్ల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతోందని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు విమర్శించారు. నిడమర్రు మండలం అడవికొలనులో బుధవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా కోటి సంతకాల సేకరణ జరిగింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయం అసంబద్ధమైనదని, దీనిపై ప్రభుత్వం ప్రజాభిప్రాయం కోరాలని ఆయన డిమాండ్ చేశారు.