సత్యసాయి: జిల్లా వైసీపీ అధ్యక్షురాలు ఉషశ్రీ చరణ్ గోరంట్ల మండలంలో పర్యటించారు. మంగళవారం మల్లాపల్లి పంచాయతీ కలిగిరి గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వైసీపీ సీనియర్ నాయకురాలు పాటూరి సుజాతమ్మ భర్త నాగిరెడ్డిని, మరో సీనియర్ నాయకుడు శివప్ప భార్య వెంకటరమణమ్మను ఆమె వారి స్వగృహాలకు వెళ్లి పరామర్శించారు. అలాగే గ్రామస్తులను పలు సమస్యలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.